తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి నిలిపిన బిజెపి ఇప్పటికే దుబ్బాక ఎన్నికల్లో సత్తా చాటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాల నుంచి 50 స్థానాలకు ఎగబాకింది. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అధిష్టానం మంచి పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీ ని మరింత పటిష్టం చేసేందుకు గాను మోడీ- షాలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తెలంగాణ నుంచి బిజెపికి నలుగురు ఎంపీలు ఉన్నారు. ఒకరు రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాగా మరొకరు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, ఇక నిజామాబాద్ నుంచి అరవింద్ కూడా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అలానే ఆదిలాబాద్ నుంచి ఎంపీ సోయం బాబూరావు బిజెపి తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు గానూ మిగిలిన ముగ్గురిలో మరొకరిని కేంద్రమంత్రిగా అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. బండి సంజయ్ కు ఎలాగూ కేంద్ర మంత్రి స్థాయిలోనే పని చేసుకునేలాగా అవకాశాలు కల్పించారు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో అన్ని విషయాల్లో ఆయనకు పవర్ ఉంటుంది. కిషన్ రెడ్డి ఎలాగూ కేంద్ర మంత్రిగా ఉన్నారు. దీంతో అరవింద్ కి గాని బాబురావు గాని కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టేందుకు అధిష్టానం పెద్దలు ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఇది ప్రచారమే కాగా ఎంత వరకు నిజం అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.