ఆ వైసీపీ ఎమ్మెల్యేని అసెంబ్లీకి రావద్దన్నారా ?

-

రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఆమె నియోజకవర్గ పరిధిలోనే జరుగుతున్నా అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడలేదుతరచూ వివాదాల్లో తల దూర్చుతున్నందుకే ఆమెను రావద్దని ఇండైరెక్ట్‌గా చెప్పారా..అసెంబ్లీ దారిదాపుల్లో కనిపించవద్దన్న ఆదేశాలు ఇచ్చారా? తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై అసెంబ్లీ లాబీల్లో ఇదే ప్రచారం జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సహజంగా స్థానిక ఎమ్మెల్యే గైర్హాజరు అవ్వరు. కాని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కథే వేరు. పార్టీలోనే స్థానిక నాయకులతో ఆమెకు ముందు నుంచి గొడవలే. వివాదాస్పద ధోరణే. డబ్బుల వ్యవహారంలోనే ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఆ మధ్య క్లబ్బులు పెట్టి డబ్బు సంపాదించటం ఎలా అనే టాపిక్‌ పై తన దగ్గర రైట్‌ హ్యాండ్‌గా ఉండే ఓ వ్యక్తితో మాట్లాడిన ఆడియో టేపులు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీని పై ఎమ్మెల్యే వివరణ ఇచ్చిన ఆడియో టెపుల వ్యవహారం రాజధానిలో హాట్ టాపిక్ గా మారింది.ఇటువంటి వివాదాస్పద అంశాల జోలికి పోవద్దని పార్టీ పెద్దలు పిలిచి చివాట్లు పెట్టిన తర్వాతే ఎమ్మెల్యే వివరణ ఇచ్చారన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు సాగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు కూడా రావద్దని పరోక్షంగా ఆదేశాలు వెళ్ళాయని ప్రచారం జరిగింది.

వివాదాల్లో ఉన్నప్పుడు మీడియా ముందో, సహచర ఎమ్మెల్యేల సమక్షంలోనూ ఈ అంశాలు ప్రస్తావనకు వస్తే …మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందనే కారణంతోనే ఈ ఆదేశాలు వెళ్లాయని అసెంబ్లీ లాబీల్లో టాక్‌ ఉండవల్లి శ్రీదేవి పై టాక్ నడుస్తుంది.. మొత్తం మీద ఆవిడెక్కడ అన్న టాక్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార,విపక్ష సభ్యుల్లో నడిచింది.

Read more RELATED
Recommended to you

Latest news