కర్నూలు జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ప్రీతిబాయి పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జిఓ ప్రతులను జనసేనతో కలసి ప్రీతిబాయి తల్లిదండ్రులు చించి వేశారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జిఓ ఫేక్ జిఓ అని ఢిల్లీలో సీబీఐ ఆఫీసులో సంప్రదిస్తే ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జిఓ ఎందుకు పనికిరాదన్నారని ప్రీతిబాయి తల్లి పార్వతి, జనసేన యర్షద్ లు ఆరోపించారు.
8 నెలల క్రితం సీబీఐ విచారణకు ఇస్తూ జిఓ ఇచ్చినా ఇప్పటి వరకు విచారణ మొదలు పెట్ట లేదని .ప్రీతిబాయి తల్లి పార్వతి ఆరోపించారు. జిఓ పనికిరాదని సీబీఐ ఆఫీస్ లో చెప్పారు ప్రీతిబాయి తల్లి పార్వతి పేర్కొన్నారు. ప్రీతిబాయి కేసులో న్యాయం కోసం ఆందోళనలతోపాటు న్యాయపోరాటం చేస్తాం ప్రీతిబాయి తల్లి పేర్కొంది.