టీ20 సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..

-

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా జూలు విదిల్చింది. టీ-20 సిరీస్‌ గెల్చుకుంది. రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియా విధించిన 195 పరుగుల భారీ లక్ష్యాన్ని… మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ హాఫ్‌ సెంచరీ చేయగా… చివర్లో హార్దిక్‌ పాండ్యా చెలరేగి ఆడాడు. 22 బంతుల్లోనే 42 రన్స్‌ చేశాడు. కెప్లెన్‌ కోహ్లీ 40 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుని బదులు తీర్చుకుంది. మొదటి మ్యాచ్ ను గెలిచిన టీమిండియా తాజాగా జరిగిన రెండో టీ20మ్యాచ్ లోనూ బంపర్ విక్టరీ కొట్టింది.

ఆస్ట్రేలియా నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ మంచి ఓపెనింగ్ ని అందించారు. కేఎల్ రాహుల్ 30 పరుగులు చేసి ఔటవ్వగా 36 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 52 పరుగులు చేసి ధావన్ పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 24 బంతుల్లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 40 చేసి ఔటవ్వగా చివర్లో హార్థిక్ పాండ్యా(42), శ్రేయాస్ అయ్యర్ (12) టీమిండియాని విజయ తీరాలకు చేర్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news