బ్రేకింగ్ : క్రికెట్ బెట్టింగ్ కేసులో డీఎస్పీ అరెస్ట్

-

కామారెడ్డి క్రికెట్ బెట్టింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కామారెడ్డి డి.ఎస్.పి. లక్ష్మీ నారాయణను ఏసీబీ అరెస్ట్ చేసింది. అక్రమాస్తుల కేసులో డి.ఎస్.పిని అరెస్ట్ చేసినట్టు చెబుతున్నారు. హైదరాబాద్, రంగా రెడ్డి, నల్గొండ నిజమాబాద్ లో జరిపిన సోదాల్లో 2.12 కోట్ల ఆస్తుల గుర్తించింది ఏసీబీ. అంతే కాక సికింద్రాబాద్ తిరుమలగిరి లో 30కి పైగా తూటాలు లభ్యం అయినట్టు సమాచారం.  మార్కెట్ విలువ ప్రకారం దాదాపు 20 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

arrested
arrested

నిజామాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో లక్ష్మీనారాయణ లింకు బయట పడడంతో ఏసీబీ ఈయన మీద ద్రుష్టి సారించినట్టు చెబుతున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో కలిసి పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లు ఎసిబి తేల్చింది. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో భారీగా ఆస్తులు గుర్తించారు. వ్యవసాయ భూముల తో పాటు హైదరాబాదులో భవనాల్ని కూడా ఎసిబి గుర్తించింది. 

Read more RELATED
Recommended to you

Latest news