కేంద్రం ఆ చట్టాన్ని తొలగిస్తే రాజీనామా చేస్తా: సిఎం సంచలన వ్యాఖ్యలు

-

ఎవరైనా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ను తొలగించడానికి ప్రయత్నిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హర్యానాలోని నార్నాల్‌ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన ఆదివారం 25 వ రోజులోకి ప్రవేశించడంతో రైతులకు భరోసా ఇచ్చారు. ఎంఎస్పీ ఎల్లప్పుడు ఉంటుందని అన్నారు.

ఎవరైనా దానిని రద్దు చేయడానికి ప్రయత్నిస్తే, మనోహర్ లాల్ ఖత్తర్ రాజకీయాల నుంచి తప్పుకుంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. ఎంఎస్పీ ఇప్పుడు ఉంది భవిష్యత్తులో కూడా ఉంటుంది అని ఆయన స్పష్టం చేసారు. శనివారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో సమావేశమై కొనసాగుతున్న రైతుల సమస్యపై చర్చించిన తర్వాత ఖత్తర్ ఈ ప్రకటన చేశారు. రైతుల నిరసన గురించి మరికొన్ని వ్యాఖ్యలు చేసారు.

“ఈ సమస్యకు (రైతుల నిరసన) పరిష్కారం చర్చ ద్వారా కనుగొనబడాలి. ఈ సమస్యను త్వరలో పరిష్కరించాలని నేను చెప్పాను. నిబంధనల ప్రకారం కొత్త వ్యవసాయ చట్టాల నిబంధనలకు సంబంధించిన సమస్యలపై రైతులతో మాట్లాడటానికి కేంద్రం సిద్ధంగా ఉంది ”అని ఆయన అన్నారు. కేంద్రం మరియు రైతు సంఘాల మధ్య మరో రౌండ్ చర్చలు జరిగే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. వ్యవసాయ సంఘాలను మూడు వ్యవసాయ చట్టాల గురించి పూర్తిగా వివరించాలని ఆయన స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news