లోన్ యాప్స్ మీద స్పందించిన ఆర్బీఐ.. ఎలా ఫిర్యాదు చేయాలంటే ?

-

లోన్ యాప్‌ లపై నమోదైన కేసుల అంశంలో ఆర్బీఐ స్పందించింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్సీకి లోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని ఆర్బీఐ పేర్కొంది. కొన్ని యాప్‌లు అధిక వడ్డీలు, రుసుములు తీసుకున్నట్లు తెలిసింది అని ఆర్బీఐ పేర్కొంది. సులభంగా రుణాలు ఇస్తున్నారని యాప్‌ల మాయలో పడొద్దని ఆర్బీఐ హెచ్చరించింది.

వ్యక్తిగత డాక్యుమెంట్లు ఎవరికీ ఇవ్వొద్దని పేర్కొంటూ ఆర్బీఐ సీజీఎం యోగేష్ దయాల్ ఒక లేఖ రిలీజ్ చేశారు. యాప్ మోసాలపై sachet.rbi.org.in వెబ్‌సైట్లో ఫిర్యాదు చేయండి అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన సీపీ అంజనీ కుమార్ కూడా ఆన్లైన్ లోన్స్ కు ఆర్బిఐ నుండి ఎలాంటి అనుమతులు లేవని ఆన్లైన్ లోన్ అప్లై చేసుకుని ఇబ్బందులు తెచ్చుకోవద్దని కోరారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 22 కేసులు నమోదు చేశామని ఆయన అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news