ఇకపై మెషీన్లు పేడ ఎత్తనున్నాయ్‌..!

-

రోజురోజుకు వ్యవసాయ రంగంలో ఖర్చుతో పాటు శ్రమన తగ్గించేందుకు అనేక ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. రైతన్నలు, డెయిరీ ఫారాల నిర్వాహకుల సౌకర్యార్థంగా ‘ఆటోమేటెడ్‌ డంగ్‌ క్లీనర్‌’ఆవిçష్కృతమైంది. అందులో మనం సమయాన్ని పెట్టి వదిలేస్తే చాలు.. ఆ సమయంలోనే పేడ, వ్యర్థాలు ఎత్తేస్తుంది. పలువురు ఇంజినీరింగ్‌ విద్యార్థుల పట్టుదలతో ఆవిష్కృతమైన ఈ మెషిన్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. రైతులు, వ్యాపారవేత్తలు డెయిరీ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉంది. పశువుల పెంపకం, పెడ్‌ల నిర్వహణ కోసం బిహార్, నేపాల్‌ నుంచి కూలీలను తీసుకు వస్తున్నారు. షెడ్‌ల నుంచి పేడ ఎత్తడం, శుభ్రం చేయడం ఖర్చుతో పాటు అధిక సమయాన్ని కేటాయించాలి. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లోని ఓ ప్రై వేటు ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థులు ‘డంగ్‌ క్లీనర్‌’మెషిన్‌ను తయారు చేశారు.

పని తీరు ఇలా..

1. చార్జింగ్‌తో పని చేసే ఈ మెషీన్‌ 150 పశువులున్న షెడ్‌ను 34 గంటల్లో శుభ్రం చేస్తుంది.
2. మీథేన్‌ గ్యాస్‌ ఆధారంగా పేడను గుర్తించేందుకు మెషీన్‌లో సెన్సర్లు ఉంటాయి.
3. ఈ యంత్రానికి ఉన్న చక్రాలతో షెడ్‌ అంతా తిరుగుతూ వాటికున్న రోబోటిక్‌ చేతులతో పేడను ఎత్తేసుకుంటుంది.
4. ఆ తర్వాత పేడను ఓ కంటెయినర్‌లో నింపుకుని ఎక్కడ డంప్‌ చేయాలో నిర్ధారించుకొని అక్కడికెళ్లి పారబోస్తోంది.

5. ఏ సమయంలో షెడ్‌ శుభ్రం చేయాలో మనం ముందుగానే టైమ్‌సెట్‌ చేస్తే ఆ సమయంలో క్లీన్‌ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news