Breaking : కేంద్రంతో చర్చలకు అంగీకరించిన రైతు సంఘాలు

-

ఎట్టకేలకు కేంద్రంతో చర్చలకు రైతు సంఘాలు అంగీకరించాయి. ఈ డిసెంబర్ 29 న ఉదయం 11 గంటలకు చర్చలకు రైతు సంఘాలు తమ సమ్మతి తెలిపాయి. నాలుగు అంశాల ఎజెండాను కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ కు లేఖ ద్వారా పంపాయి రైతు సంఘాలు. అందులో మొదటి అంశం మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతుల పై చర్చ జరపాలి.

farmers
farmers

రెండో అంశం అన్ని రకాల పంటలకు జాతీయ రైతు కమిషన్ సూచించిన లాభదాయకమైన MSPకి చట్ట బద్దత కల్పించడం. ఇక మూడో అంశం ఢిల్లీ రాజధాని పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆర్డినెన్స్ కు సవరణలు చేయాలి, ఆర్డినెన్స్ శిక్షా నిబంధనల నుండి రైతులను మినహాయించాలి. అలానే నాలుగో అంశం  రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ‘విద్యుత్ సవరణ బిల్లు 2020’ ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయడం పై చర్చ జరగాలి. ఇక కేంద్రంతో మనసు పెట్టి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలో రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news