కడప జిల్లా వైసీపీలో వర్గపోరు పరస్పర దాడులు, ఆపై కాల్పులకు దారి తీసింది. వీరపనాయునిపల్లి మండలం పాయసంపల్లిలో కొత్త సంవత్సర వేడుకల్లో వైసీపీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైసీపీ నేత నిమ్మకాయల సుధాకర్‌రెడ్డిపై ప్రత్యర్థి వర్గం దాడి చేసింది. మహేందర్‌రెడ్డి, అతని అనుచరులు సుధాకర్‌రెడ్డిపై కత్తులు, రాళ్లతో దాడి చేశారు.
దీంతో సుధాకర్‌రెడ్డి ప్రత్యర్థులపై కాల్పులు జరిపాడు. ఈ ఘర్షణలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం పాయసంపల్లిలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. సుధాకర్ రెడ్డి కేకు కట్ చేయబోగా, మహేందర్ రెడ్డి అడ్డుకున్నారు. మన కొత్త సంవత్సరం ఉగాది కనుక… ఇప్పుడు కేకు కట్ చేయవద్దని మహేందర్ రెడ్డి అనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తోంది.