భారీగా నమోదయిన లిక్కర్ సేల్స్.. రికార్డులు బద్దలు

-

న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో బారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. నాలుగు రోజుల్లో రూ. 758.76 కోట్ల విలువైన లిక్కర్ సేల్స్ జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. గత నెల 28 నుంచి 31 వరకు పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. వేడుకులకు అనుమతి లేకున్నా భారీగా మద్యం వ్యాపారం మాత్రం జరిగింది. 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీర్ కేసులు కొనేసారు మందు బాబులు.

తెలంగాణలో గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. కేవలం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో రూ.300 కోట్ల విక్రయాలు జరిగాయి. అయితే గతేడాది చివరి నాలుగు రోజులల్లో లిక్కర్ అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది చివరి నాలుగు రోజుల్లో 2 లక్షల 60 వేల కేసులు ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. గతేడాది తో పోల్చితే సుమారు 287 కోట్ల ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news