బ్రేకింగ్‌ : తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్, కాలేజెస్

-

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు జిల్లా కలెక్టర్లు, మంత్రులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన అనేక అంశాల గురించి చర్చించారు. అలానే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి 9వ తరగతి నుండి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. కరోనా కారణంగా గతేడాది విద్యా సంవత్సరం అంతా ఆన్ లైన్ లోనే నడిచింది.

ఇప్పుడు కూడా దాదాపుగా ద్వారానే విద్యార్థులు అందరూ హాజరవుతున్నారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తొమ్మిది నుండి ఆ పైన ఉన్న అందరికి క్లాస్ లు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోపక్క అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని కూడా కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news