బావిలో పడ్డ చిరుత మిస్సింగ్.. సర్వత్రా టెన్షన్ !

-

తెలంగాణలో కొద్దిరోజులుగా వరుసగా పులులు, చిరుతల సంచారం టెన్షన్ పెడుతోంది. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అలాగే మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో ఈ చిరుతల సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న ఒక చిరుత వేట కోసం గ్రామానికి వచ్చి అనుకోకుండా ఒక బావిలో పడిపోయింది. అయితే నిన్నటి రాత్రి వరకు బావిలోనే ఉన్న చిరుత ఈ రోజు ఉదయానికి బావిలో లేకుండా పోయింది. అదే ఇప్పుడు అటవీశాఖ అధికారులకు టెన్షన్ పెట్టిస్తోంది. 

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాల్కపూర్ లోని  వ్యవసాయ బావిలో చిరుతపులి పడింది. బావిలో సొరంగం ఉండటంతో చిరుత ఉదయానికి మిస్సయింది. నిన్న హైదరాబాదు నుండి వచ్చిన రెస్క్యూ టీమ్  రాత్రంతా కాపలా కాసినా అది మిస్సయింది. బావిలోకి నిచ్చెనలు వేయడంతో పైకి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు అధికారులు. మరో గంటలో  బావిలోకి దిగి చూస్తామని అంటున్నారు అటవీశాఖ అధికారులు. చిరుత జాడ తెలియకుండా పోవడంతో రాత్రి నుండి మల్కాపూర్ గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news