మరో 45 రోజుల్లో టర్కీ ఎడారిగా మారుతుందంట..?

-

టూరిజానికి మరోపేరుగా చెపుకునే టర్కీలో రానున్న 45 రోజుల్లో కరువు విలయతాండవం చేయబోతుందని ఆదేశ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నెల పక్షం రోజుల్లో నిరంతరం నీటితో కళకళలాడే ఇస్తాంబుల్‌ ఎడారిని తలపించబోతుందని వారు హెచ్చరిçస్తున్నారు. అక్కడి దేశంలోని నదులు, జలాశయాలతో పాటు డ్యామ్‌లన్నీ ఎండిపోయి తీవ్రమైన కరువు సంభవించనుందట. వచ్చేకొన్ని నెలల్లో ప్రధాన నగరాలు, పట్టణాల్లో నీళ్లు ఎండిపోయి ఎడారిగా మారుతాయని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. విటంనిటీకి పధాన కారణం టర్కీ దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదు చేసుకోవడంతో దశాబ్ద కాలానికి కరువుకు దారి తీసింది. దీంతో దాదాపు 17 మిలియన్ల టర్కీవాసులు నీటి కొరత ఎదుర్కోనున్నటు తెలుపుతున్నారు.

తక్కువ వర్షపాతమా..

ఈ నెల నుంచి మరో 100–110 రోజుల్లో డ్యామ్‌లు, సరస్సులు, రిజర్వాయర్లలోని నీరు సైతం ఎండిపోయే ఆస్కారం ఉంటుంది. దీంతో నీటికోసం తహతహలాడాల్సిన దుస్థితి రావొచ్చు అంటున్నారు.
టర్కీలోని అతిపెద్ద నగరాలైన ఇజ్మిర్‌ 36% , బ్యూర్సా డ్యామ్‌లు ఇప్పటికే శాతం, 24 % వరకు నీరు ఎండిపోయింది. అక్కడ గోధుమలు ఉత్పత్తి చేసే ప్రధాన ప్రాంతాలైన కోన్యా ప్లేన్, ఎడ్రైన్‌ ప్రావిన్స్‌లలో కూడా పంటలు సాగు చేసేందుకు నీరు లేక రైతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గీస్, బుల్గారియా సరిహద్దుల్లోని ఈ ప్రాంతాల్లో సాగుబడి పెద్ద సమస్యగా మారింది. గతేడాది నవంబర వరకు అక్కడ కనీసం 50% కూడా వర్షపాతం నమోదు కాలేదు. ఈ క్రమంలో గత నెలలో వర్షం కోసం వరుణుడిని ప్రార్థించాలంటూ మత వ్యవహారాల డైరెక్టరేట్‌ సూచించింది. ఈ సమస్యల తీరి, మున్ముందు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కారాదంటే టర్కీదేశంలో కొన్ని ఆనకట్టలను నిర్మించాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news