ఎంతో మంది సెలెబ్రిటీస్ ఇక్కడ ఫోటోలు తీసుకుని పోస్ట్ చెయ్యడం మనం చూసే ఉంటాం. మిలియనీర్లు కూడా ఇక్కడకి రిలాక్స్ అవ్వడానికి మాల్దీవుల్లో ఉండే ఆ ఐలాండ్ కి వెళ్తూ ఉంటారు. కామన్ పీపుల్ కి ఇక్కడకి వెళ్లడం అసాధ్యం. మాల్దీవుల్లో కొత్త ఐలాండ్‌ని సిద్ధం చేసి మొన్ననే ఓపెన్ చేశారు. దీని రేటు చూశారంటే షాక్ అవ్వాల్సిందే..! అయితే మరి ఎంతవుతుందో చూద్దామా..? మరి ఇప్పుడే పూర్తి వివరాల్ని చూసేయండి.
మాల్దీవుల్లో ఇటీవల కొత్త ఐలాండ్‌ని ఓపెన్ చేయడం జరిగింది. దాని వివరాలని చూస్తే… ఆ ఐలాండ్ పేరు ‘ఇతాఫుషి’. ఇది సముద్రం మధ్యలో ఉంది. ఈ అందాల దీవిలో త్రీబెడ్‌రూమ్ విల్లా, టూ బెడ్రూమ్ విల్లా అలాగే ఫోర్ బెడ్రూమ్ విల్లాలు కూడా ఉన్నాయి. 32,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఇది మాల్దీవుల్లో ఉన్న అతి పెద్ద ప్రైవేటు దీవి. దీన్ని చేరుకోవాలంటే మాల్దీవుల నుంచి 40 నిమిషాల పడవ ప్రయాణం, 15 నిమిషాల విమాన ప్రయాణం అవసరం. సముద్రం మధ్య ఉండడం…అద్భుతంగా రూపొంచడం… వాహ్ ఊహించుకుంటేనే ఎంత బాగుందో కదా…! అందుకే మిలియనార్లు, సెలెబ్రెటీలు అవకాశం వచ్చినప్పుడల్లా వెళ్లిపోతుంటారు.
స్విమ్మింగ్ ఫూల్లు కూడా కొలువుదీరాయి. అందమైన ప్రకృతి నడుమ రుచికరమైన రకరకాల ఆహార పదార్థాలు చూస్తే వావ్ అనాల్సిందే. వినోదం పంచేందుకు క్లబ్‌హౌస్, పిల్లల ప్లేజోన్, వాటర్ స్పోర్ట్స్, డైవింగ్, పడవ ప్రయాణాలు, చుట్టూ నీలి సముద్రం ఎంత గానో ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఆస్ట్రేలియన్, జపనీస్, ఇండియన్, చైనీస్ ఇలా చాలా రకాల వంటకాలు అక్కడ లభిస్తాయి. ఒక్క రాత్రి ఉండాలంటే రూ.58 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.