ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చాల మంది అనేక తప్పులని చేస్తూ ఉంటారు. అలానే అప్పుడప్పుడు ఫోన్ ఛార్జింగ్ చేస్తుంటే బ్యాటరీ పేలిపోవడం… లేదా ఛార్జింగ్ పెట్టక ఫోన్ పని చెయ్యక పోవడం లాంటివి ఎన్నో వింటూ ఉంటాం. అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చేసే తప్పులు ఏమిటి…?, ఏ పనులు చెయ్యకూడదు..? ఇలా అనేక విషయాలు మీ కోసం. మరి ఇప్పుడే చూసేయండి.
వీలైనంత వరకు కంపెనీ ఛార్జర్ ని వాడండి. ఒక వేళ నకిలీ ఛార్జర్ ఉపయోగిస్తే ఫోన్ లేదా ఛార్జర్ కాలిపోయే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఫోన్ ఛార్జ్ చేసేందుకు కంపెనీ ఇచ్చిన ఛార్జర్‌నే ఉపయోగించాలి. అలానే బ్యాటరీ పూర్తిగా జీరో అయిన తర్వాత ఛార్జ్ చేయడం మంచిదని నమ్ముతుంటారు. కానీ అలా చేయడం ఏ మాత్రం మంచిది కాదు. బ్యాటరీ ఛార్జింగ్ 20 నుంచి 30 శాతం మధ్య ఉన్నప్పుడే ఛార్జ్ చేయడం మంచిది.
అలానే ఫోన్ రాత్రంతా ఛార్జింగ్ చేయడం మంచిదా..కాదా..? ఈ విషయానికి వస్తే… ఫోన్ రాత్రంతా ఛార్జింగ్ పెట్టినా ఏ ప్రమాదం లేదు. ఎందుకంటే….? బ్యాటరీ వంద శాతం ఛార్జ్ అయిన తర్వాత ఛార్జింగ్ దానంతట అదే ఆగిపోతుంది. అయితే ఇలా ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగిఉంచడం వల్ల ఓవర్ చార్ అవ్వద్దు. ఫోన్ కేస్ ని రిమూవ్ చేసి రాత్రంతా పెట్టేయొచ్చు. అలానే ఫోన్ పైన ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్ ఛార్జ్ పెట్టి రాత్రంతా వదిలేయొచ్చు.