మరి కొద్ది సేపట్లో వైసిపి ఎంపీలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని క్యాంప్ ఆఫీస్ లో భేటీ కానున్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం మీద ఈ సందర్భంగా చర్చిస్తారని అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఏ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలి అనే అంశం మీద పార్టీ ఎంపీలకు వైయస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.
అయితే జగన్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి సాగిల పడుతోందని కేసులు, అరెస్టుల దృష్ట్యా కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలను సాధించలేక పోతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారి పార్లమెంట్ ఎలాంటి వ్యూహాలను అనుసరించనున్నారు అనేది ఉత్కంఠగా మారింది. ఇక మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సంబందించిన తీర్పు కూడా మరికాసేపట్లో విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా జగన్ ఎంపీలతో చర్చించే అవకాశం ఉంది.