రియో.. ఓ గుర్రం కథ..!

-

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రియో (గుర్రం)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటివరకు మొత్తంగా 18 సార్లు గణతంత్ర కవాతుల్లో పాల్గొన రియో వయసు కేవలం 22 సంవత్సరాలే. భారత సైన్యానికి చెందిన 61 కావల్రీ రెజిమెంట్ కు చెందింది. రిపబ్లిక్ డే వేడుకల్లో అనేక ప్రదర్శనలు, కవాతుల్లో పాల్గొన్ని దేశవ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది. 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రియో అశ్విక దళానికి కెప్టెన్ గా వ్యవహరించింది. కవాతుల్లో పాటు క్రీడల్లోనూ ఎంతో ప్రావీణ్యం పొందింది. ఇప్పటివరకు 12 అర్జున అవార్డులు, ఎన్నో బహుమతులను గెలుచుకుంది.

horse

రియో ప్రత్యేకతలు..

రియో భారతదేశంలోనే పుట్టింది. ఇది హనోవేరియన్ జాతికి చెందిన గుర్రం. రియోకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటూ వస్తోంది. రియో చాలా ప్రత్యేకమైన అశ్వమని శిక్షకుడు కెప్టెన్ దీపాంశు షెరాన్ పేర్కొన్నారు. అధికారులు చెప్పిన ప్రతి మాటను తూ.చా. తప్పకుండా పాటిస్తుందని, ఇచ్చిన ఆదేశాలను సక్రమంగా నిర్వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. రియోకు శిక్షణ ఇచ్చిన దీపాంశు షెరాన్ ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో నివాసముంటారు. ఈయన కుటుంబం నాలుగు తరాలుగా సైన్యంలో సేవలందిస్తున్నారు.

ఈ సందర్భంగా కెప్టెన్ దీపాంశు షెరాన్ మాట్లాడుతూ.. ‘‘2011 సంవత్సరంలో ఎన్డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ), 2015వ సంవత్సరంలో ఐఎంఏ (ఇండియన్ మిలిటరీ అకాడమీ)లో చేరాను. ఈక్వెస్ట్రియన్ లో నైపుణ్యాన్ని పెంచుకున్నాను. 2014లో అండర్-25 టెంట్ పెగ్గింగ్ ఈవెంట్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించాను. ఉత్తమ రైడర్ గా కూడా ఎంపికయ్యాను. అప్పుడే గుర్రాలపై ఆసక్తి, అనుబంధం పెరిగింది. రియో చాలా ప్రత్యేకమైన అశ్వం. చిన్న వయసులోనే 18 సార్లు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంది. రియోకి ఈ అరుదైన గౌరవం దొరకడం చాలా సంతోషంగా ఉంది.’’ అని ఆయన పేర్కొన్నారు.

కవల్రీ రెజిమెంట్ అశ్విక దళాన్ని.. మైసూర్ లాన్సర్స్, జోధ్ పూర్ లాన్సర్స్, గ్వాలియర్ లాన్సర్, రాయల్ బ్రిటిషన్ ఆర్మీ 6 అశ్విక దళాల తర్వాత నియమించడం జరిగిందన్నారు. ఈ అశ్విక దళం 1918 సంవత్సరంలో బ్రిటిష్- ఇజ్రాయేల్ మధ్య జరిగిన యుద్ధంలో కీలక పాత్ర పోషించాయని దీపాంశు చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news