పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏకగ్రీవాలు చేశారు అన్న ఆయన నామినేషన్ ఆన్లైన్ ద్వారా వేసే లాగా కొత్త విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలానే పోటీ చేసే అభ్యర్థులపై దాడులను నియంత్రించే లాగా చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల కమిషన్ ని కోరారు.
అలాగే పోలీసులు, అధికారులు ఎన్నికల సంఘానికి సహకరించాలని ఆయన కోరారు. ఇక బిజెపి జనసేన కలిసి అభ్యర్థులకు మద్దతు ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నికలలో కూడా ఇరు పార్టీల నుంచి ఒకే అభ్యర్థి బరిలో ఉంటారని ఆయన పేర్కొన్నారు. అయితే అభ్యర్థి ఎవరు అనే దానిమీద ఇంకా క్లారిటీ లేదని ఆయన అన్నారు. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అన్నారు.