రాజశేఖర్ సినిమాకి జీవిత దర్శకత్వం.. నాలుగోసారి..

-

యాంగ్రీ మాన్ రాజశేఖర్ ఈ మధ్య సినిమాల వేగం పెంచారు. గరుడవేగ మంచి టాక్ తెచ్చుకోవడంతో వరుసగా సినిమాలపై దృష్టి పెట్టారు. గరుడవేగ తర్వాత కల్కి పెద్దగా హిట్ కాకపోయినా మళయాల చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు నీలకంఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల నీలకంఠ ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. ప్రస్తుతం ఆ సినిమాను జీవిత డైరెక్ట్ చేయనుందని వినిపిస్తుంది.

ఇప్పటి వరకు రాజశేఖర్ హీరోగా వచ్చిన శేషు, ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే సినిమాలకు జీవిత దర్శకత్వం వహించింది. ప్రస్తుతం ఈ సినిమాను డైరెక్ట్ చేయనుందని వినిపిస్తుంది. ఇప్పటికైతే అధికారిక ప్రకటన రాకపోయినప్పటీకీ, మరికొద్ది రోజుల్లో వెల్లడి చేసి, వచ్చే నెలలో షూటింగ్ మొదలెట్టనున్నారట. రాజశేఖర్ గారు ఇటీవలే కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news