అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అకౌంట్ ని సస్పెండ్ చేసిన ట్విట్టర్ యాజమాన్యం మరో మారు షాకిచ్చింది. ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెట్టడం సహా అనేక ఎన్నికలను ఒప్పుకోనని, ఫలితాలు కరెక్ట్ కావని, నేనే అధ్యక్షుడిని అంటూ వైట్ హౌస్ ఖాళీ చేయనని మంకు పట్టు పట్టడం సహా అనేక ఇతర కారణాల వల్ల ట్విట్టర్ యాజమాన్యం అకౌంట్ ని సస్పెండ్ చేసింది. ఐతే ఈ విషయమై పెద్ద చర్చే జరిగింది. మాజీ అధ్యక్షుడి ట్విట్టర్ అకౌంట్ ని సస్పెండ్ చేయడం చిన్న విషయం కాదు.
తాజాగా ఈ సస్పెన్షన్ గురించి ట్విట్టర్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సస్పెన్షన్ ని ఎత్తివేసే ప్రయత్నం చేయబోమని, ఎప్పటికీ ఆ అకౌంట్ సస్పెన్షన్ లోనే ఉంటుందని, యాక్టివేట్ చేసే ఉద్దేశ్యమే లేదని చెప్పుకొచ్చారు. దీంతో అమెరికాలో ట్రంప్ కి మద్దతు ఇస్తున్నవారు షాక్ కి గురవుతున్నారు. 2024లో మళ్ళీ అధ్యక్షుడిగా గెలిచినా కూడా అకౌంట్ సస్పెన్షన్ లోనే ఉంటుందట.