ఆటోపై ఇంటిని నిర్మించిన యువ‌కుడు.. ఆనంద్ మ‌హీంద్రా ఫిదా..

-

ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డంలో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త, మ‌హీంద్రా గ్రూప్ సంస్థ అధినేత ఆనంద్ మ‌హీంద్రా ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా అలా ప్ర‌తిభ చాటిన ఓ వ్య‌క్తి గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని షేర్ చేశారు. త‌మిళ‌నాడుకు చెందిన ఓ వ్య‌క్తి ఆటోపై చిన్న‌పాటి ఇంటిని నిర్మించాడు. ఆ నిర్మాణానికి ఆనంద్ మ‌హీంద్రా ఫిదా అయ్యారు. ఆ వ్య‌క్తికి చెందిన వివ‌రాల‌ను ఆయ‌న అడిగారు.

anand mahindra mesmerized with auto house

త‌మిళ‌నాడుకు చెందిన ఎన్‌జీ అర్జున్ ప్ర‌భు ఓ ఆటోపై చిన్న‌పాటి ఇంటిని నిర్మించాడు. అందులో చిన్న బెడ్ రూం, కిచెన్‌, లివింగ్ స్పేస్‌, టాయిలెట్‌, బాత్‌ట‌బ్‌, వ‌ర్క్ ప్లేస్ ఉన్నాయి. ఆ ఇంటికి 250 లీట‌ర్ల వాట‌ర్ ట్యాంక్‌ను కూడా ఏర్పాటు చేశాడు. దీంతో ఆ ఇల్లు క‌దిలే ఇల్లు అయింది. దాన్ని ఎక్క‌డికంటే అక్క‌డికి సుల‌భంగా తీసుకెళ్ల‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో ఆ ఇల్లు ఎంతో మందికి ఉప‌యోగంగా ఉంటుంది. ఇక ఆ ఇంటిని నిర్మించేందుకు అత‌నికి రూ.1 ల‌క్ష ఖ‌ర్చు అయింది.

కాగా ప్ర‌భు నిర్మించిన ఆ ఆటో ఇంటి ఫొటోను చూసిన ఆనంద్ మ‌హీంద్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఆ యువ‌కుడి ఐడియాకు ఆయ‌న ఫిదా అయ్యారు. త‌మ కంపెనీకి చెందిన బొలెరో వాహనాన్ని అలాంటి డిజైన్‌తో నిర్మించాల‌ని, అందుకు ఆ యువ‌కుడితో మాట్లాడాల‌ని, అత‌ని వివ‌రాలు పంప‌మ‌ని ఆయ‌న నెటిజ‌న్ల‌ను కోరారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆ యువ‌కుడితో త్వ‌ర‌లో మాట్లాడ‌నున్నారు. కాగా ఆ యువకుడి ఆటో ఇంటి ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news