మార్చి 08 సోమవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

మార్చి 8 – మాఘమాసం – సోమవారం.

 

మేషరాశి:ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారాల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలిస్తాయి. శ్రమాధిక్యత వల్ల ఫలితం వస్తుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టపోతారు. విద్యార్థులు చదువు విషయంలో అధిక శ్రద్ధ అవసరం. మీలో ఉన్న కోపం వల్ల తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీచంద్రశేఖరాష్టకం పారాయణం చేసుకోండి.

 

todays horoscope

వృషభరాశి:స్వల్ప నష్టాలు ఏర్పడతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు అధిక శ్రమ చేయడం వల్ల బాగుంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందక ఇబ్బందిలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి.

 

మిధునరాశి:రుణబాధలు తీరిపోతాయి !

ఈ రోజు బాగుంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. రుణబాధలు తీరిపోతాయి. ధనయోగం కలుగుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో స్నేహితుల సలహాలు తీసుకుంటారు. మిత్ర లాభం కలుగుతుంది.

పరిహారాలుః ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కర్కాటకరాశి:శత్రువులు కూడా మిత్రులు అవుతారు !

ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. అనారోగ్యాలను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉంటారు. అయిన వారి ఆదరణ పొందుతారు. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉత్తమ విద్యార్థిగా పేరు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహ స్థలాన్ని కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.

పరిహారాలుః ఈరోజు శ్రీకామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

 

సింహరాశి:ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. మిత్రుల సహకారం పొందుతారు. మిత్రలాభం కలుగుతుంది. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో గొప్ప పదోన్నతులు కలుగుతాయి. గ్రహంలో ఏదో ఒక శుభకార్యం తలపెడుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. అనవసర   విషయాల వల్ల చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది.

పరిహారాలుః ఈరోజు దుర్గా దేవిని ఆరాధించండి.

 

తులారాశి:బంధుమిత్రుల ఆదరణ పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో స్నేహితులతో అందరితో సఖ్యతగా ఆనందంగా ఉంటారు. వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు కలుగుతాయి. తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుతారు. బంధుమిత్రుల ఆదరణ పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. సోదరులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

 

వృశ్చిక రాశి:ధనయోగం కలుగుతుంది !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. ధనయోగం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత విద్యలకు అర్హులవుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో పై అధికారుల పొందుతారు. మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని బాగా ఆదరిస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారాల్లో లాభాలు అనుకూలిస్తాయి.

పరిహారాలుః ఈరోజు శ్రీలలితా చాలీసా పారాయణం చేసుకోండి.

 

ధనస్సురాశి:ఈరోజు సంతోషకరంగా ఉంటుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల అందరి ఆదరణ పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. ఉన్నత కళాశాలల్లో సీట్లు పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించుకుంటారు లాభాలు కలుగుతాయి. ఇంతకు ముందు ఉన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు.

పరిహారాలుః ఈరోజు లింగాష్టకం పారాయణం చేసుకోండి.

 

మకరరాశి:వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దైవనామ స్మరణ మీకు అండగా ఉంటుంది. తక్కువ మాట్లాడడం మంచిది. ప్రయాణాలు అనుకూలించవు. విద్యార్థుల చదువు మీద దృష్టి వహించడం మంచిది. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో పని వత్తిడి పెరుగుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు.

పరిహారాలుః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. పెద్ద వారిని గౌరవించడం వల్ల ప్రతి పనిలో ఆదరణ పొందుతారు. ఉద్యోగస్తులు కార్యాలయంలో ఉన్నత పదవులను పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

పరిహారాలుః ఈరోజు శ్రీఅన్నపూర్ణాదేవిని ఆరాధించండి.

 

మీనరాశి:ఈరోజు అనుకూలంగా లేదు !

ఈరోజు అనుకూలంగా లేదు. అధిక శ్రమ వల్ల ఫలితాలు అనుకూలిస్తాయి. తక్కువ మాట్లాడటం మంచిది. అనవసర విషయాలను చర్చించడం వల్ల విభేదాలు ఏర్పడతాయి. విద్యార్థులం బాగా కష్టపడి చదువుకోవడం మంచిది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలించవు. ఉద్యోగస్తులకు కార్యాలయాలపై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీవిష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news