స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఫైనాన్స్ డైరెక్టర్ ని చెట్ల కింద !

-

విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫైనాన్స్ డైరెక్టర్ ని కార్మికులు చెట్ల కింద నిర్బంధించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను బయటకు తీసుకువెళ్లేందుకు సిఐఎస్ఎఫ్ విఫలయత్నం చేస్తుంది. ఆయన రక్షణ కోసం ఏర్పాటు చేసిన తాళ్ళను కూడా కార్మికులను తొలగించారు.

దీంతో సిఐఎస్ఎఫ్ సిబ్బందితో కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళన జరుగుతున్న కారణంగా విశాఖ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విశాఖ వైపు వెళ్లే అన్ని వాహనాలను విజయనగరం రోడ్డు వైపు మళ్లిస్తున్నారు. అనకాపల్లి జాతీయ రహదారి వద్ద ఈ వాహనాలను పోలీసులు మళ్ళిస్తునట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news