పోలీసులకి షాక్.. అక్షింతలు వేసి కొల్లు రవీంద్రకు బెయిల్ !

-

మచిలీపట్నం పోలీసులకు కోర్టు షాక్ ఇచ్చింది.. ఈరోజు తెల్లవారకుండానే కొల్లు రవీంద్ర ఇంటిని చుట్టుముట్టి మరి అరెస్టు చేసిన పోలీసులకు కోర్టు షాక్ ఇస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకి బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కొల్లు రవీంద్ర ఉదయం 6:30 గంటలకు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు రిమాండ్ విధిస్తారని ఉద్దేశంతో ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి వైద్య పరీక్షలు సైతం చేయించేశారు పోలీసులు.

కానీ జడ్జి మాత్రం పోలీసులకు షాక్ ఇచ్చారు. అరెస్టుకు పోలీసులు ప్రొసీజర్ ఫాలో కాలేదని జడ్జి అభిప్రాయపడ్డారు. అసలు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. అలాగే బెయిల్ మంజూరు చేస్తూ పోలీసుల విచారణకు సహకరించాలని కొల్లు రవీంద్రను జడ్జ్ ఆదేశించారు. ఇక ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ ను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రులు నారా లోకేష్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news