ఏపీ సచివాలయ నిర్మాణంలో మరో సారి చంద్రబాబు…

-

ఎప్పుడూ గ్రాఫిక్స్ లో చూసే ఏపీ రాజధానిని అదే స్థాయిలో నిర్మాంచాలని తలపెట్టిన తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు  ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ భవనాల నిర్మాణానికి ఉద్దేశించిన రాఫ్ట్‌ ఫౌండేషన్‌ను కాంక్రీట్‌తో నింపే కార్యక్రమాన్ని రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇది ఏకబిగిన మూడున్నర రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. సచివాలయంలో ఉన్నతాధికారులు,విభాగాధిపతుల కోసం నిర్మించనున్న ఐదు టవర్లను నిర్మిస్తున్నారు. ఇందులో రెండో భవన పునాది పనులకు చంద్రబాబు ఈరోజు శంకుస్థాపన చేశారు. రాఫ్ట్‌ ఫౌండేషస్‌ మాస్‌కాంక్రీట్‌ విధానంలో పునాది వేస్తున్నారు.

13 అడుగుల లోతు, 12 వేల క్యూబిక్‌ మీటర్ల మేర ఫౌండేషన్‌కు ఏర్పాట్లు చేశారు. 69.8లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐదు టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. 40 అంతస్థులతో నాలుగు, 50 అంతస్థులతో ఒక భవన నిర్మాణం పూర్తి చేస్తారు.  ఇదిలా  ఉంటే చంద్రబాబు చేపడుతున్న కార్యక్రమాలపై సామాజిక మాధ్యమాల్లో అనేక వివిధ రకాల కామెంట్లను నెటిజన్లు విసురుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news