పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI పర్సనల్ లోన్ ఇచ్చే ప్రక్రియను మరెంత ఈజీ చేసింది. దీనితో కస్టమర్స్ కేవలం 4 క్లిక్స్‌తో పర్సనల్ లోన్ కోసం అప్లై చెయ్యొచ్చు. అయితే గతంలో కస్టమర్లు లోన్ తీసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు లోన్ కోసం బ్యాంక్ కి కూడా వెళ్ళక్కర్లేదు.
ఎస్బీఐ కేవలం 4 క్లిక్స్ తో పర్సనల్ లోన్ ఇస్తోంది. పైగా తక్కువ వడ్డీకే పర్సనల్ లోన్ ఇస్తోంది ఎస్‌బీఐ. కేవలం 9.60 శాతం వడ్డీకే పర్సనల్ లోన్ ఇస్తామని ప్రకటించింది. గతం లో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 12 శాతం నుంచి 16 శాతం మధ్య ఉండేవి. కస్టమర్లకు రూ.20 లక్షల వరకు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇస్తోంది ఎస్‌బీఐ. ఇప్పుడు అయితే హోమ్ లోన్ వడ్డీ రేట్లతో సమానంగా ఇప్పుడు పర్సనల్ వడ్డీ రేట్లు ఉన్నాయి. 10 శాతం లోపే పర్సనల్ లోన్ లభిస్తోంది. అయితే ఇవి ప్రీ అప్రూవ్డ్ లోన్స్.
ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటే ఏమిటంటే..? కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ లాంటివి పరిగణలోకి తీసుకొని తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తుంటాయి. లోన్ మంజూరైందో లేదో తెలుసుకోవాలంటే ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా చూడాలంటె రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ లోని చివరి 4 అంకెలు టైప్ చేసి 567676 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
ఇలా మీకు ఈజీగా తెలుస్తుంది. లేదు అంటే 7208933142 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా పర్సనల్ లోన్ డిపార్ట్‌మెంట్ నుంచి కాల్ బ్యాక్ వస్తుంది. లేదా SMS PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. మరిన్ని వివరాలకు 1800112211 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. లేదా ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ లో చూడొచ్చు. యోనో లో కూడా మీరు తెలుసుకోవచ్చు.