దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. వైరస్ మార్పులపై తాజాగా నిర్వహించన అధ్యాయనంలో పలు కీలక నిర్ణయాలు వెల్లడయ్యాయి. దీంతో పరిశోధకులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే వెలుగు చూడని కొత్తరకం వైరస్ భారత దేశంలో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వైరస్‌ను మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో గుర్తించామన్నారు. ఈ వైరస్ రెండు సార్లు రూపాంతంరం (డబుల్ మ్యుటెంట్) చెందుతోందని తెలిపారు.
ఇప్పటికే దేశంలోని 18 రాష్ట్రాలో కరోనా వైరస్‌పై పరిశోధకులు అధ్యాయనం చేశారు. దాదాపు 771 పాజిటివ్ కేసులపై పరీక్షలు నిర్వహించారు. ఆయా కేసుల్లో వైరస్ మార్పులు జరిగినట్లు వారు గుర్తించారు. 736 కేసుల్లో బ్రిటన్ వైరస్‌ను, 34 కేసుల్లో దక్షిణాఫ్రికా వైరస్‌ను, బ్రెజిల్ వైరస్ వేరియంగ్ 1కేసులో గుర్తించామన్నారు. ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌కు ఈ రూపాంతరమే కారణమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదన్నరు. ఇంకా ఈ వైరస్ జన్యుక్రమంపై అధ్యాయనం కొనసాగుతోందని ఇండియన్ సార్స్ కొవ్-2 కన్సార్టియం ఆన్ జీనోమిక్స్ తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా సుమారు 70 జిల్లాలలో కొత్త రకాల కరోనా వైరస్‌ను గుర్తించినట్లు, ఈ వేరియంట్ వైరస్ వ్యాప్తి కొనసాగుతోందని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్ర డైరెక్టర్ ఎన్కే.సింగ్ స్పష్టం చేశారు.
కరోనా కొత్త నిబంధనలివే..
కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్త నియమాలు అమలులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు టెస్ట్, ట్రాక్, ట్రీట్ ప్రోటోకాల్‌ను పాటించాలని సూచించారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు కొత్త నియమాలు అమలు అవుతాయని, కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య 70 శాతానికి పెంచాలన్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అంతరాష్ట్ర రవాణపై ఎలాంటి ఆంక్షలు విధించరాదన్నారు.