తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. మధ్యాహ్నం మూడు గంటలకు వరకు అధికారులు నామినేషన్ల స్వీకరించారు. మొత్తం మీద ఇప్పటివరకు తిరుపతి పార్లమెంటుకు మొత్తం 26 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్క రోజే వైసిపి, బీజేపి, కాంగ్రెస్, సీపీఎం, స్వతంత్రులు కలిపి 12 మంది నామినేషన్లు దాఖలయ్యాయి.
వైకాపా నుంచి గురుమూర్తి, టిడిపి నుండి పనబాక లక్ష్మి, బిజెపి – జనసేన నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్, సిపిఎం నుండి యాదగిరి నామినేషన్లు వేశారు. ఏఎన్‌పీ పార్టీ అభ్యర్థిగా కె.శ్యామ్‌ధన్, ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున పి.నాగరాజు, మరికొందరు స్వతంత్రులు నామినేషన్ వేశారు. సోమవారం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్లు అధికారులు పరిశీలించనున్నారు. ఇక ఇక్కడ గెలుపు ఖాయమని అధికార వైసీపీ ధీమాతో ఉంది. మరో పక్క తెలుగుదేశం, బీజేపీ- జనసేన అభ్యర్దులు సైతం గెలుపు తమదే అని చెప్పుకుంటున్నారు.