పార్టీకి హ్యండిచ్చిన నేతల పై దృష్టి పెట్టిన కేసీఆర్..ఆ రెండు జిల్లాల నేతల్లో టెన్షన్

-

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ రెండు చోట్ల విజయం సాధించింది. అయితే ఆ విజయాల వెనుకున్న వెన్నుపోట్ల పై అధికార పార్టీ దృష్టిపెట్టింది. ఎన్నికల్లో పార్టీకి నష్టం చేసిన నేతల చిట్టా పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు చేరడంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా వరంగల్,నల్గొండ,ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలో నష్టం చేసిన పార్టీ నేతల పై దృష్టి పెట్టారట సీఎం కేసీఆర్‌.

దుబ్బాక‌, గ్రేట‌ర్ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తగలడంతో ఎమ్మెల్సీ ఎన్నికల పై సీరియస్ గా దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్. విపక్ష పార్టీలకు ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా అన్ని తానై ఎమ్మెల్సీ ఎన్నికలను పర్యవేక్షించారు. కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో సిట్టింగ్ సీటు ఖమ్మం,నల్గొండ ఎమ్మెల్సీతో పాటు, బీజేపీ సిట్టింగ్ స్థానమైన రంగారెడ్డి మహబూబ్ నగర్ సీటును సైతం గెలుచుకుంది. ముందుగానే జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల‌కు బాధ్యతలు అప్పగించి దిశానిర్ధేశం చేసింది. అయితే కొందరు సొంత పార్టీ ప్రజాప్రతినిధులే ఎన్నికల్లో సహయనిరాకరణ చేయడం సీఎం కేసీఆర్ ఆగ్రహానికి కారణమైంది.

రంగారెడ్డి,హైదరాబాద్,మహబూబ్ నగర్ స్థానంలో పార్టీ నేత‌ల తీరు ఫ‌ర్వాలేద‌నిపించినా ఖమ్మం,నల్గొండ,వరంగల్ స్థానంలో మాత్రం పార్టీకి నష్టం చేశారట. వరంగల్ జిల్లాకి చెందిన పార్టీ కీలకనేత కేబినెట్ హోదా తో అసెంబ్లీలో ఎమ్మెల్యేలను సమన్వయం చేయల్సిన చీఫ్ విప్ ఏ గాడి తప్పారట. ఇక ఖమ్మం జిల్లాకి చెందిన మంత్రి సైతం ప్రచారంలో పాల్గొన్న ఎన్నికలు దగ్గరపడిన కీలక సమయంలో అందుబాటులో లేకుండా వెళ్లడం జిల్లాని పట్టించుకోకుండా నియోజకవర్గానికే పరిమితమవ్వడం పై సైతం కేసీఆర్ సీరియస్ గా ఉన్నారట. కొత్తగూడెం నియోజ‌క‌వ‌ర్గంలో ఇదే పరిస్థితి ఉత్పన్నమైందట.

ఇక నల్గొండ జిల్లాకి చెందిన మంత్రి సైతం పార్టీ నేతలను సమన్వయం చేయడంలో విఫలమయ్యారట. కోదాడ‌, న‌కిరేక‌ల్ ఎమ్మెల్యేలు,మునుగోడులో టీఆర్ఎస్ ఇంచార్జ్ ఎన్నికల పై పెద్ద శ్రద్దపెట్టలేదన్న నివేదిక సైతం సీఎం కేసీఆర్ కి చేరింది. ఆర్థికంగా సాయం చేయ‌డంతోపాటు అన్ని ర‌కాలుగా మ‌ద్దతు ఇచ్చినా నేతలు మరో ఆలోచన చేయడం వెనుకున్న సీక్రెట్ ఏంటా అని ఆరా తీస్తున్నాయట ప్రగతి భవన్ వర్గాలు. ఖ‌మ్మం, న‌ల్లగొండ జిల్లాల్లో తీన్మార్ మ‌ల్లన్నకు భారీగా ఓట్లు రావ‌డం పై దృష్టి పెట్టారట. గత అసెంబ్లీ ఎన్నికలో ఇలా తోక జాడించిన నేతలకు ఎంపీ ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించారు సీఎం కేసీఆర్. ముగ్గురు ఎమ్మెల్సీలను సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయినా నేతల తీరులో మార్పు రాకపోవడం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట గులాబీ బాస్.

ఈ నివేదికలు ఇప్పుడు ఆరుజిల్లాల పార్టీ నేతలను టెన్షన్ పెడుతున్నాయట. ముఖ్యంగా ఖమ్మం,నల్గొండ నేతల్లో మాత్రం పార్టీ అధినేత నుంచి ఎప్పుడు ఎలాంటి షాకింగ్ న్యూస్ వస్తుందో అన్న ఆందోళన పెరిగిందట.

 

Read more RELATED
Recommended to you

Latest news