గుడ్ ఫ్రైడే: ప్రాముఖ్యత, విశేషాలు.. కొటేషన్లు..

-

యేసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, శిలువ మోస్తూ మరణించిన క్రీస్తుని తలచుకుంటూ ప్రపంచ క్రైస్తవులందరూ జరుపుకునే పండగ గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు మరణం కారణంగా ప్రపంచంలోని పాపం ప్రక్షాళన కాబడిందని క్రైస్తవులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా అన్ని చర్చిల్లో ప్రార్థనలు చేస్తూ యేసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన గుడ్ ఫ్రైడే వస్తుంది.

ప్రతీ సంవత్సరం ఒకానొక ప్రత్యేక రోజున వచ్చే ఈ గుడ్ ఫ్రైడే పర్వదినాన మీ స్నేహితులతో పంచుకోవాల్సిన కొటేషన్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

దేవుడి ఆశీస్సులు ఎల్లప్పటికీ మనతోనే ఉంటాయి. గుడ్ ఫ్రైడే..

మన పాపాలని ఆయన తీసుకుని చెట్టుకు వేలాడేసుకున్నాడు. ఆయన గాయాల వల్ల మీరు స్వస్థత పొందారు. గుడ్ ఫ్రైడే.

దేవుడి పట్ల నీకున్న నమ్మకం, విధేయత నీకు సంతోషాన్ని, మనశ్శాంతిని చేకూరుస్తాయి. ఆ దేవుడు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలనుకుంటూ.. గుడ్ ఫ్రైడే.

నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.. ఈ ప్రపంచంలోని ప్రేమనంతటినీ నీ వద్ద ఉంచాలనీ, తోటివారికి ఆ ప్రేమని పంచుతూ ఉండాలనీ, అలా పంచుకుంటూ ఈ విశ్వం మొత్తాన్ని ప్రేమమయంగా మార్చాలనీ.. నా ఈ కోరికను భగవంతుడు తీరుస్తాడని నమ్ముతూ ఈ పవిత్ర పర్వదినాన.. గుడ్ ఫ్రైడే.

గుడ్ ఫ్రైడే.. చాలా పవిత్రమైన రోజు. ఈ రోజున మనల్ని ఆ భగవంతుడికి దగ్గర చేసే రోజు. మనం భగవంతుడికి ఎంత దగ్గరో మనకు తెలిసే రోజు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ గుడ్ ఫ్రైడే పర్వదిన పవిత్ర శుభాకాంక్షలు.

Read more RELATED
Recommended to you

Latest news