అలర్ట్: ఎండాకాలంలోనూ కరోనా వ్యాప్తి..!

-

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది వైరస్ వ్యాప్తి మరింత వేగంగా జరుగుతోంది. గడిచిన 24 గంటల్లో గంటకు 4,822 చొప్పున ఒక్కరోజులో 1,15,736 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ నెలాఖరిలోగా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు తెలుపుతున్నారు.

corona
corona

అయితే చాలా మందికి ఒక అపోహ ఏర్పడింది. ఎండాకాలంలో కరోనా వ్యాప్తి తగ్గుతుందని భావిస్తున్నారు. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా కరోనా అంతం కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఎంత వేడిమి ఉన్నా.. కరోనా అంతం కాదన్నారు. ఫ్లూ వంటి వ్యాధులు వేడికి తట్టుకోలేవి, కానీ కరోనా వైరస్ వేడిని తట్టుకోగలదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంపై వైద్యులు కూడా స్పందించారు. కోవిడ్-19కి వాతావరణ పరిస్థితితో సంబంధం లేదని, గతేడాది సెప్టెంబర్ నెలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైతే.. ఈ ఏడాది మార్చిలోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు. అయితే ప్రస్తుతం ఎండలు మండిపోవడం వల్ల ప్రజలు ఉక్కపోతకు మాస్కులు తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. దీంతో వైరస్ వ్యాధి ఇంకా వేగంగా జరిగే ప్రమాదం ఉందన్నారు. అందుకే ప్రజలు ఎండకి బయటకు రాకపోవడమే మంచిదని, బయటకు వచ్చినా కరోనా నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కాగా, దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,15,736 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,28,01,785కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా కరోనా కొత్త కేసులు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలో 55,469, పంజాబ్‌లో 2,905, ఛత్తీస్‌గఢ్‌లో 9,921, కర్ణాటకలో 6,976, తమిళనాడులో 3,986, ఢిల్లీలో 5,100, గుజరాత్‌లో 3,280, కేరళలో 3,502, ఆంధ్ర ప్రదేశ్‌లో 2,331, తెలంగాణాలో 1,914 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డు సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news