ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ లో ఈరోజు ఆసక్తికర పోరుకు రంగం సిద్దం అయింది. ఈరోజు మరి కాసేపట్లో చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్,కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లకు ఇది మొదటి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని చూస్తున్నాయి. చెపాక్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు బలాబలాలు చూద్దాం.
సన్ రైజర్స్ : సన్‌రైజర్స్‌కు బలం బౌలింగే. స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి జట్టులో చేరడం సన్‌రైజర్స్ కి మరింత బూస్ట్ ఇవ్వనుంది. అతని తోడుగా నటరాజన్,సందీప్ శర్మ ఉన్నారు. ఇక స్పీన్ లో రషీద్ ఖాన్ ఉండనే ఉన్నారు. అలా మొత్తం మీద హైదరాబాద్ అన్ని విభాగాల్లో బలంగా ఉంది.
నైట్ రైడర్స్ : నైట్ రైడర్స్ విషయానికి వస్తే.. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, మెర్గాన్, దినేశ్ కార్తీక్‌లు బ్యాటింగ్‌లో రాణిస్తే కోల్‌కతాకు తిరుగుండదు. మంచి ఫినిషింగ్ ఇవ్వడానికి ఆండ్రూ రసూల్ ఉన్నాడు. అలానే కొత్తగా జట్టులోకి వచ్చిన షకీబ్ పాత్ర కూడా ముఖ్యమే.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అంచనా : డేవిడ్ వార్నర్ (సి), జానీ బెయిర్‌స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, సాహా, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, సందీప్ శర్మ.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అంచనా : శుబామన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, ఇయాన్ మోర్గాన్ (సి) దినేష్ కార్తీక్, షకీబ్ సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమ్మిన్స్, కమలేష్ నాగర్‌కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి