తిరుపతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా ముందుకు వెళుతుంది. అయితే ప్రచారం చేసే విషయంలో చంద్రబాబు నాయుడు కొన్ని కొన్ని అంశాలను జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని అంశాలను వైసీపీ నేతలు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కీలక అంశాల్లో దిశా నిర్దేశం చేయాల్సిన అవసరం కూడా ఉంది.
ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే సోషల్ మీడియాలో చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యాక్టివ్గా కనబడటంలేదు. 2019 ఎన్నికల సమయంలో సోషల్ మీడియా లో జరిగిన చాలా తప్పులు పార్టీ ఓటమికి ప్రధాన కారణం అయ్యాయి. ఇప్పుడు తిరుపతి ఎన్నికల్లో కూడా సోషల్ మీడియానే ప్రధాన కారణం గా మారే అవకాశాలు కూడా ఉండవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా మీద దృష్టిపెట్టి కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయాలి.
ఇక సోషల్ మీడియాకు సంబంధించి తిరుపతి ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుంటే మంచిదని ఎప్పటినుంచో కొంత మంది కోరుతున్నారు. అయినా సరే చంద్రబాబు నాయుడు దీని మీద దృష్టి పెట్టకపోవడంతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నాయకత్వం కూడా లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానం సోషల్ మీడియాలో బలంగా తీసుకువెళ్లే అవకాశం ఉన్న దాన్ని సమర్థవంతంగా వాడుకలోలేని పరిస్థితుల్లో టిడిపి నేతలు ఉన్నారు.