భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,85,190 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 1026 మంది మృతి చెందారు. గడచిన 6 నెలల తరువాత దేశంలో అత్యధిక సంఖ్యలో మరణాలు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటలలో మహారాష్ట్రలో 60,212 కొత్త కరోనా కేసులు, ఉత్తర ప్రదేశ్ 18,021 కేసులు, ఢిల్లీలో 13,468 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.
గడిచిన 24 గంటలలో మహారాష్ట్రలో 281 మంది చనిపోగా ఉత్తరప్రదేశ్ లో 85 మంది మృతి చెందగా, ఢిల్లీ లో 81 మరణాలు నమోదు అయ్యాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్ 12 నాటికి దేశంలో మొత్తం 25,92,07,108 నమూనాలను పరీక్షించారు, ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 1,38,52,599 కేసులు నమోదు కాగా, 1,71,929 మరణాలు నమోదు అయ్యాయి. ఇక కరోనా కేసుల నిర్ధారణలో బ్రెజిల్‌ను భారత్ అధిగమించింది. భారత్ లో ఇప్పటివరకు 10,85,33,085 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.