నాగార్జునసాగర్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. అయితే నాగార్జునసాగర్ ఎన్నికల విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనే సూచనలు కొంతమంది చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. గెలిచే అవకాశాలు లేకపోయినా సరే కొంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంను ఇబ్బంది పెట్టవచ్చు.
కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి చాలా బలంగా ఉన్నారు. అయితే నాగార్జునసాగర్ లో పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు ఇస్తారు అన్న దానిపైనే కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు కొంత బిజెపి వైపు చూసే అవకాశం ఉంటుంది. అయితే సీఎం కేసీఆర్ పవన్ కళ్యాణ్ తో ఈ విషయంలో సమావేశం నిర్వహించి తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు.
ఈ తరుణంలో పవన్ క్వారంటైన్ కు వెళ్ళారు. అయితే బీజేపీ నేతలు ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకు వెళ్లడం తో తెలంగాణలో కూడా నాగార్జునసాగర్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడంతో బీజేపీ నష్టపోయిన సంగతి తెలిసిందే.