కరోనా ఉన్నా లెక్క చేయని జనం… నాన్ వెజ్ కోసం బారులు !

-

దేశంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు విస్తరిస్తున్నాయి. కరోన విస్తరిస్తున్నా సరే నిబంధనలు గాలికి వదిలేసి పబ్లిక్ నాన్ వెజ్ మార్కెట్ల వెంట పడుతున్నారు. సండే వస్తే చాలు నాన్ వెజ్ మర్కెట్స్ కిటకిటలాడుతున్నాయి. బోర్డులు మాత్రం నో మాస్క్ నో ఎంట్రీ అని ఉంటే, జనం మాత్రం నో మాస్క్, నో సోషల్ డిస్టెన్స్ అంటూ నాన్ వెజ్ కోసం బారులు తీరుతున్నారు.

మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వేగంగా కరోనా విస్తరిస్తున్నా నిబంధనలు గాలికి వదిలేసిన జనాలు ఈరోజుఆ ఆదివారంకాబట్టి నాన్ వెజ్ మార్కెట్స్ లో పెద్ద ఎత్తున దర్శనం ఇస్తున్నారు. ఇక తెలుగు ఛానెళ్లు కూడా ఇదే అంశాన్ని టార్గెట్ చేస్తున్నాయి. మాస్క్ లేదని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు,వెటకారపు సమాధానాలు వినిపిస్తున్నాయి. సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదవుతున్నా సరే కట్టడికి ప్రజలు సహకారం లేకపోతే పెను ప్రమాదం తప్పేలా లేదని అధికార యంత్రాంగం చెబుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news