నకిరేకల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్గపోరు.. దూకుడు పెంచిన కాంగ్రెస్, బీజేపీ

-

నల్గొండ జిల్లాలో వరుస ఎన్నికల కోలాహాలం కొనసాగుతుంది. నిన్నటి వరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగగా ఇప్పుడు నకిరేకల్ మున్సిపల్ ఎన్నికలు హోరెత్తిస్తున్నాయి. నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్‌. నామినేషన్ల గడువు ముగియడంతో ప్రచారాలు మీద దృష్టి పెట్టాయి పార్టీలు. ఒక్కో వార్డులో అధికార పార్టీ నుండి ఇద్దరు బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ కు అన్నీ తానై ఎంపీ కోమటిరెడ్డి వ్యవహారిస్తున్నారు.


నకిరేకల్ లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య వర్గపోరు నడుస్తుంది.. నకిరేకల్ మున్సిపల్ ఎన్నికలల్లో టీఆరెస్ నేతల మధ్య వర్గపోరు పార్టీ అధికార టీఆరెస్ పార్టీ అబ్యర్దుల గెలుపు ఓటముల మీద ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇద్దరి మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్ వేశారు. వీరి వర్గపోరు కాంగ్రెస్,బీజేపీలకు అనుకూలంగా మారేలా కనిపిస్తుంది. ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరడంతో ఎమ్మెల్యే మద్దతుదారులు టిక్కెట్ రేసులో ముందున్నారు. ఇక వీరేశం కూడా పోటీగా తన మద్దతుదారులను రెబల్ అభ్యర్దులుగా బరిలో దించారు.

 

నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో ఇక బీజేపీ కూడా పట్టు కోసం ప్రయత్నిస్తూ తమ అభ్యర్థులను బరిలో దింపింది. కామ్రేడ్లకు ఒకప్పటి పెట్టని కోట అయిన నకిరేకల్‌లో పూర్వపట్టు సాధించేందుకు ఏడు వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టింది. అధికార టీఆర్‌ఎస్‌ ఐదుగురు ఎమ్మెల్యేలను ఇంఛార్జీలుగా నియమించగా వారు రేపోమాపో నకిరేకల్ లో దిగనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే చిరుమర్తి ప్రచారం నిర్వహిస్తుండగా ఇతర నేతలు కూడా నామినేషన్ల ఉప సంహరణల తరువాత ప్రచారాలతో హోరెత్తించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news