దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ప్రజలు ముందుకు వచ్చినా కేసులతో పాటు మరణాలు కూడా ఆగడం లేదు. వేలాది మరణాలు నమోదు అవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కాసేపటి క్రితం విడుదల చేసిన లెక్కల ప్రకారం చూస్తే గత 24 గంటల్లో 3,46,786 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి.
2,624 మంది రోగులు అధికారికంగా ప్రాణాలు కోల్పోయారు. 2,19,838 మంది నిన్న కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,66,10,481 మంది కరోనా బారిన పడ్డారు. 1,38,67,997 మొత్తం ఇప్పటి వరకు మన దేశంలో కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. 1,89,544 మంది ప్రాణాలు కోల్పోయారు. 25,52,940 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం టీకా తీసుకున్న వారు 13,83,79,832 మందిగా ఉన్నారు.