డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ ని ఇలా అదుపులో ఉంచచ్చు…!

-

ఆరోగ్యమే అన్నిటి కంటే ముఖ్యం. మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరిస్తే డయాబెటిస్ ని సులువుగా కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎంతో వేగంగా డయాబెటిస్ ఉన్న వాళ్ళ ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి.

పైగా ఈ విషయం వల్ల చాలా భయపడుతూ కూడా అంటారు. అయితే అటువంటి వాళ్ళు ఈ చిన్న చిట్కాని అనుసరిస్తే షుగర్ ని అదుపులో ఉంచుకోవడానికి వీలవుతుంది. అరటి తొక్క తీసుకోవడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది.

అరటి తొక్క వల్ల కలిగే ఉపయోగాలు:

నిపుణులు చేసిన పరిశోధన ప్రకారం అరటి తొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిలో ఎసెన్షియల్ ఎమినో యాసైడ్స్, విటమిన్-సి, బి6, పొటాషియం, మెగ్నీషియం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. దీనిలో ఉండే ఫ్లవనోయిడ్స్ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తాయి. అదే విధంగా అరటి తొక్క లో ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు పెరుగుతూ ఉంటే ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది.

దీనిని ఎలా తీసుకోవాలి..?

అరటి తొక్కని సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. అరటి తొక్కను తీసి ఉడకబెట్టి స్నాక్స్ కింద తీసుకోవచ్చు లేదు అంటే అరటి తొక్క పొడి మార్కెట్ లో అమ్ముతూ ఉంటారు దానిని పాలల్లో లేదా నీళ్లలో కలుపుకుని తీసుకోవచ్చు. ఉదయాన్నే పరగడుపున దానిని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news