రెమ్‌డెసివిర్‌ కాదు, స్టెరాయిడ్స్‌, బ్లడ్‌ థిన్నర్స్‌ కోవిడ్‌ బాధితులను రక్షిస్తున్నాయి..!

-

కరోనాతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇంజెక్షన్ల వల్ల కరోనా తీవ్రస్థాయి తగ్గుతుంది. ప్రాణాపాయ పరిస్థితికి చేరకుండా బాధితులను కాపాడవచ్చు. అయితే రెమ్‌డెసివిర్‌ కాకుండా స్టెరాయిడ్స్, బ్లడ్‌ థిన్నర్స్‌ కూడా కోవిడ్‌ బాధితులను రక్షిస్తున్నాయని వైద్య నిపుణులు తెలిపారు.

steroids and blood thinners working for covid patients

సంజయ్‌ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌కే ధీమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సోకిన వారిలో ఊపిరితిత్తులు వాపులకు గురవుతాయి. రక్త నాళాల్లో రక్తం గడ్డ కడుతుంది. దీంతో ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి. అయితే స్టెరాయిడ్స్‌ను ఉపయోగించడం వల్ల వాపులను తగ్గించవచ్చు. బ్లడ్‌ థిన్నర్స్‌ వల్ల రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. దీంతో కోవిడ్‌ బాధితులకు ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తకుండా ఉంటాయి. ప్రస్తుతం చాలా వరకు కోవిడ్‌ బాధితులకు ఈ రెండు రకాల మెడిసిన్లను ఉపయోగించి చికిత్సను అందిస్తున్నాం. వారు కోవిడ్‌ నుంచి త్వరగా కోలుకుంటున్నారు.. అని తెలిపారు.

అయితే ఈ రెండు రకాల డ్రగ్స్‌ కోవిడ్‌ నుంచి రక్షిస్తున్నప్పటికీ అత్యవసర పరిస్థితి వస్తే రెమ్‌డెసివిర్‌ను తప్పనిసరిగా వాడాల్సి ఉంటుందన్నారు. దీంతో ప్రాణాపాయ స్థితి నుంచి కోవిడ్‌ బాధితులు బయట పడతారని తెలిపారు. ఇక స్టెరాయిడ్స్, బ్లడ్‌ థిన్నర్స్‌ మార్కెట్‌లో లభిస్తాయని, కానీ వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాటిని వాడాలని, కోవిడ్‌ మధ్యస్థ, తీవ్ర లక్షణాలు ఉన్నప్పటికీ ఆ డ్రగ్స్‌ను వాడితే ఫలితం ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news