పంజాబ్ కింగ్స్‌కు షాక్… కేఎల్ రాహుల్‌కు సర్జరీ

-

ఐపీఎల్ 2021లో పంజాబ్ కింగ్స్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్ సీజన్ కు దూరం కానున్నాడు. శనివారం రాత్రి కేఎల్ రాహుల్‌కు తీవ్ర కడుపునొప్పి వచ్చింది. దీంతో మెడికల్ బృందం అతన్ని పరీక్షించి ఆస్పత్రికి తరలించింది. అయితే రాహుల్‌ను పరీక్షించిన వైద్యులు అక్యూట్ అపెండీసైటిస్ తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్‌ యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇది శస్త్ర చికిత్సతోనే నయం అవుతుందని, అందుకే అతడిని ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొంది. ఇక రాహుల్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసింది. రాహుల్‌కు అపెండిసైటిస్ సర్జరీ నేపథ్యంలో అతడు ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యే అవకాశం ఉంది. కాగా ఈ సీజన్ లో ఇప్పటివరకు 7 మ్యాచ్ లు ఆడిన రాహుల్ 331 పరుగులతో రెండో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్‌ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఆదివారం మయాంక్ అగర్వాల్ నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ మరో ఓటమిని మూటగట్టుకుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు పంజాబ్ కింగ్స్‌ జట్టు 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే పంజాబ్ జట్టుకు ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ఇక కెప్టెన్ రాహుల్‌ తిరిగి జట్టులో చేరడంపై ఎలాంటి స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Latest news