హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారా…? అయితే రోగ నిరోధక శక్తి ఇలా పెంపొందించుకోండి…!

-

కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి సమయంలో రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం మీరు హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారా..? అయితే ఈ విధంగా మీరు ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. చాలా రకాల మందులు, విటమిన్ సప్లిమెంట్స్ మరియు ఆయుర్వేద మూలికలుని ఉపయోగించడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీని పెంపొందించుకోవచ్చు. దీనితో కరోనాతో పోరాడడానికి వీలవుతుంది.

రోగనిరోధక శక్తి ఎలా పెంపొందించుకోవాలి….?

గ్రీన్ టీ:

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. అదే విధంగా బాక్టీరియా వైరస్ ని దరిచేరకుండా ఉంచుతుంది. రెండు కప్పుల గ్రీన్ టీ మీరు రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎండలో నిలబడండి:

కరోనా కేసులు ఎక్కువై పోతున్నాయి. ఇటువంటి సమయంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మీరు మేడ మీదకు వెళ్లి లేదా బాల్కనీలో నిల్చుని సూర్యకిరణాలు పడేలా కాసేపు ఉండండి. దీనితో సూర్య కిరణాలు సెల్స్ కి ఎనర్జీని ఇస్తాయి తద్వారా ఇన్ఫెక్షన్తో పోరాడడానికి బాగుంటుంది.

డ్రై ఫ్రూట్స్ తినండి:

డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. డ్రై ఫ్రూట్ ద్వారా మనకి జింక్ లభిస్తుంది. బాదాం, వేయించిన పల్లీలు, గుమ్మడి గింజలు, వాల్ నట్స్ వీటిలో జింక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోండి.

బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ తీసుకోండి:

బ్రేక్ ఫాస్ట్ ని ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో తీసుకోండి. వీటితో పాటుగా మీరు కూరగాయలతో చేసిన సలాడ్, బ్రెడ్, పాలు, గింజలు, నట్స్ వంటివి తీసుకోవచ్చు. ఉసిరి, బొప్పాయి, జామ కాయ, మామిడి, బచ్చలకూర కూడా ఆరోగ్యానికి మంచిది. వీటిని కూడా మీరు మీ డైట్ లో చేర్చుకోండి. దీనితో రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news