స్కోరు తగ్గకుండా.. క్రెడిట్‌ కార్డు రద్దు చేసుకోండి!

-

మీ స్కోర్‌ కార్డు తగ్గిపోయిందా? అయితే, ఈ విధంగా క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకోండి. ఈ పని మీ వద్ద రెండు కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్టులు ఉంటే ఇలా చేయండి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

ఇదేదో పెద్ద సమస్య కాదు. మీ దగ్గర ఉన్న క్రెడిట్‌ కార్డును రద్దు చేసుకోవడం సులువే. కానీ, ఏ కార్డును రద్దు చేసుకోవాలనేది నిర్ణయించడం అంత సులభం కాకపోవచ్చు. ముఖ్యంగా క్రెడిట్‌ స్కోరు తగ్గకుండా చూసుకోవాలి. వడ్డీ అధికంగా ఉండటం, ఆ కార్డుతో వచ్చే ప్రయోజనాలు మీకు అంత ఉపయోగపడకపోవడం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ హామీతో వచ్చిన కార్డును సాధారణ కార్డుగా మార్చడం, ఎక్కువ క్రెడిట్‌ కార్డులుండటం వల్ల కార్డును వెనక్కి ఇచ్చేయొచ్చు.

 

మీ దగ్గర అందుబాటులో ఉన్న రుణ మొత్తం తగ్గిపోతుంది. దీనివల్ల ఇతర కార్డుల్లో ఉన్న రుణ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది. మీ క్రెడిట్‌ కార్డు పరిమితి రూ.30వేలు. మీరు నెలకు ఈ కార్డులన్నింటిలో కలిపి రూ.30,000 ఖర్చు చేస్తారనుకుందాం. అప్పుడు మీ రుణ వినియోగ నిష్పత్తి 25శాతం. ఒకవేళ మీరు ఇందులో ఒక కార్డును వెనక్కి ఇచ్చేస్తే అప్పుడు మీ రుణ వినియోగ నిష్పత్తి 33 శాతానికి చేరుకుంటుంది. 30 శాతం కంటే మించితే, మీరు అప్పులపై అధికంగా ఆధారపడతారని బ్యాంకులు భావిస్తాయి. దీంతోపాటు మీ రుణ వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు క్రెడిట్‌ స్కోరూ తగ్గుతుంది. పాత క్రెడిట్‌ కార్డు ఉన్నప్పుడు.. దాని బిల్లుల చెల్లింపుల హిస్టరీ ఎక్కువగా ఉంటుంది. వాటిని క్రమం తప్పకుండా చెల్లిస్తే.. మీ లోన్‌ హిస్టరీపై ఒక అవగాహన ఉంటుంది. అందుకే, 10 ఏళ్లకు మించి ఉపయోగిస్తున్న కార్డులను రద్దు చేసుకోకపోవడమే మంచిది. రూపాయి బకాయి ఉన్నా.. కార్డు వివరాల్లో అది కనిపిస్తూనే ఉంటుంది.

ఖాతాను క్లోజ్‌ చేయడం, సెటిల్‌మెంట్‌ చేసుకోవడం.. ఈ రెండింటి మధ్య ఎంతో తేడా ఉంది. పూర్తి బిల్లు బకాయి చెల్లించి, కార్డును రద్దు చేసుకోవడాన్ని క్లోజ్‌గా చెప్పొచ్చు. కానీ, చెల్లించాల్సిన బిల్లులో కొంత రాయితీ అడిగి, మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు బార్‌గేయిన్‌ చేస్తే, దాన్ని సెటిల్‌ అంటారు. ఇది క్రెడిట్‌ స్కోరుపై, లోన్‌ హిస్టరీపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే వీలైనంత వరకూ కార్డు బిల్లును పూర్తిగా చెల్లించేయడమే మేలు.అలాగే బ్యాంకుకు మీరు కార్డును రద్దు చేసుకుంటున్న సమాచారాన్ని ఇవ్వండి. లిఖిత పూర్వకంగా ఆ విషయాన్ని తెలియజేయండి.

Read more RELATED
Recommended to you

Latest news