కోవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల గురించి ఎంతలా చర్చ జరుగుతుందో తెలిసిందే. ఆక్సిజన్ సిలిండర్ల సాయం కోసం ప్రముఖులని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఎన్నో రిక్వెస్టులు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఐటీశాఖ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఆంధ్ర ప్రాంతం నుండి రిక్వెస్ట్ వచ్చింది. విజయనగరం నుండి ప్రసాద్ ఆకుల అనే నెటిజజ్, ఆక్సిజన్ సిలిండర్ల కోసం రిక్వెస్ట్ పెట్టాడు. విజయనగరంలో పరిస్థితి బాగాలేదని, 12ఆక్సిజన్ క్యాన్స్ అవసరం ఉన్నాయని సాయం కోరాడు.
ఈ మేరకు రిక్వెస్టుకి స్పందించిన కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాట్ గౌతమ్ గారికి ఫార్వర్డ్ చేసి సాయం చేయమని కోరాడు. ప్రస్తుతం ఇది పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితి ఏ విధంగా ఉందన్న ఈ విషయం దీనితో అర్థమవుతుందని, రాజకీయ నాయకులు కరోనా పరిస్థితిని పట్టించుకునే పరిస్థితిలో లేరని కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు హైదరాబాద్ లో కరోనా పెరిగిపోతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తూ, పక్కవాళ్ళకి సాయం చేయడం కంటే ముందు రాష్ట్ర ప్రజలని పట్టించుకోవాలని మరికొందరు అంటున్నారు.