దేవి శ్రీ వ‌ర్సెస్ థ‌మ‌న్‌.. రేసులో ముందున్న‌దెవ‌రంటే?

-

తెలుగు ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్య‌నే కాదు మ్యూజిక్ డైరెక్ట‌ర్ల మ‌ధ్య కూడా విప‌రీతంగా పోటీ ఉంటుంది. ఇక టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు అన‌గానే వినిపించే పేర్లు దేవి శ్రీ ప్ర‌సాద్‌, థ‌మ‌న్. అప్ప‌ట్లో అనూప్ రూబెన్స్ కూడా ఉండే కానీ.. ఆ త‌ర్వాత ఆఫ‌ర్లు లేక‌పోవ‌డంతో వెన‌క ప‌డ్డాడు. దీంతో ఇప్పుడు ఈ ఇద్ద‌రి మ‌ధ్య‌నే తీవ్ర పోటీ ఉంది.

థ‌మ‌న్ డైరెక్ట్ గానే త‌మ మ‌ధ్య పోటీ ఉంద‌ని ఎన్నోసార్లు చెప్పాడు. అయితే దేవి పాట‌ల‌ను కూడా థ‌మ‌న్ డైరెక్ట్‌గానే ప్ర‌శంసించాడు. కానీ దేవి శ్రీ ప్ర‌సాద్ మాత్రం ఒక్క‌సారి కూడా మెచ్చుకోలేదు థ‌మ‌న్ పాట‌ల‌ను. అయితే ఈ ఇద్ద‌రూ ఇప్పుడు వరుస సినిమాల‌తో జోరుమీదున్నారు.

మొన్న‌టి వ‌ర‌కు దేవి శ్రీ కొన్నిఅప‌జ‌యాల‌తో వెన‌క‌బ‌డ్డాడు. కానీ ఉప్పెన సినిమాతో దుమ్ములేపాడు. దీంతో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ జోరుమీదున్నాడు. థ‌మ‌న్ కూడా అల వైకుంఠ‌పురంలో హిట్ తో సెన్సేష‌న‌ల్ అయ్యాడు. ఆయ‌న కూడా పెద్ద సినిమాల‌ను చేస్తున్నాడు. అయితే ఈ ఇద్ద‌రి మ‌ధ్య‌లో కాస్త దేవి శ్రీనే ఎక్కువ సినిమా ఆఫ‌ర్ల‌తో ముందున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news