ఈ రోజు నిజంగానే ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి గాంధీ ఆస్పత్రికి వెళ్తున్నారు. ఆయన సీఎం అయినప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గాంధీకి వెళ్లని కేసీఆర్.. కరోనా సంక్షోభంలో కూడా అక్కడ జరుగుతున్న ట్రీట్‌మెంట్‌ను పరిశీలించలేదు. కేవలం ఈటల రాజేందర్‌మాత్రమే ఇప్పటి వరకు పరిశీలించారు.
కానీ ఇప్పుడు ఆరోగ్యశాఖ కేసీఆర్ వద్దనే ఉండటం, పైగా ప్రజలు, ప్రతిపక్షాల నుంచి గవర్నమెంట్ ఆస్పత్రుల్లో వసతుల్లేవంటే తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్, బీజేపీ సందు దొరికినప్పుడల్లా గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మౌళిక వసతులపై సవాళ్లు విసుతున్నారు. పైగా ఇప్పుడు ఆరోగ్యశాఖ మంత్రి కావడంతో పాజిటివ్ వేవ్ సృష్టించడంలో భాగంగా కేసీఆర్ గాంధీ ఆస్పత్రిని విజట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఆయన ఎక్కడికి వెళ్లినా వరాల వర్షాలు కామన్. మరి గాంధీకి మొదటిసారి వెళ్తున్న క్రమంలో ఏమైనా ప్రకటనలు ఉంటాయో లేదో చూడాలి.