వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రఘురామ కృష్ణం రాజు వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రఘురామ కృష్ణం రాజు మెడికల్ రిపోర్ట్ మధ్యాహ్నం 12 గంటలకు ఇవ్వాలని తాము ఆదేశించినా సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని హైకోర్ట్ నిలదీసింది.
హైకోర్ట్ తో పాటుగా మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై హైకోర్ట్ లో విచారణ జరిగింది. 11 గంటలకు రఘురామను రమేష్ ఆస్పత్రికి తరలించాలని ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. ప్రభుత్వం పై సుమోటోగా కోర్ట్ దిక్కరణ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్ట్ నిర్ణయం తీసుకుంది. సి ఐ డీ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు కోర్ట్ దిక్కరణ కింద నోటీసులు జారీ చేయాలని హైకోర్ట్ మేజిస్ట్రేట్ ఆఫీసర్ కు ఆదేశాలు ఇచ్చింది.