ర‌ఘురామ‌పై వైసీపీ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్య‌లు.. ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే?

-

ర‌ఘురామ కృష్ణంరాజు అరెస్టుపై అటు ప్ర‌తిప‌క్షాలు ఇటు ప్ర‌జ‌ల నుంచి కూడా కొంత విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ప్ర‌భుత్వం ఆచి తూచి అడుగులు వేస్తోంది. అత‌నిపై నెగెటివ్ షేడ్స్ వ‌చ్చేలా ప్లాన్ చేస్తోది. పార్టీ ఇమేజ్‌ లేక‌పోతే ఆయ‌న ఎందుకూ ప‌నికిరాడ‌నే ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు బాగానే మాట‌లు విసిరారు.

అయితే ఎమ్మెల్యేల వ్యాఖ్య‌లు కాస్త అనుచితంగా అనిపించాయి. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య వాదాలు తెలిపే స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యే జోగు ర‌మేశ్ రెచ్చిపోయి మ‌రీ ర‌ఘురామ‌పై విరుచుకు ప‌డ్డారు.

పార్టీ గుర్తు, జ‌గ‌న్ వేవ్ లేక‌పోతే ఎంపీ ర‌ఘురామ ఎందుకూ ప‌నికి రాడంటూ చెప్పారు. ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తే ఆయ‌న వార్డు మెంబ‌ర్‌గా కూడా గెల‌వ‌లేడ‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఆయ‌న ఇంత‌లా మాట్లాడుతున్నా.. జ‌గ‌న్ మాత్రం దీనిపై స్పందించ‌లేదు. దీన్ని బ‌ట్టి ఇదంతా జ‌గ‌న్ డైరెక్ష‌న్‌లోనే ఎమ్మెల్యేలు అలా మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది. ఇన్ డైరెక్ట్‌గా ర‌ఘురామ పార్టీ నుంచి ఎంపీ ప‌ద‌వికి రాజీనామాచేయాలంటూ డిమాండ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news