రామ్‌చ‌ర‌ణ్ కు ఇబ్బందిగా మారిన డైరెక్ట‌ర్‌.. నిరాశ‌లో ఫ్యాన్స్‌

-

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. తండ్రి త‌ర్వాత అంత ఇమేజ్‌ను సొంతం చేసుకున్న స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే. చాలా త‌క్కువ టైమ్‌లోనే ఇండ‌స్ట్రీ పెద్ద హీరోల లిస్టులో చేరాడు. త‌న ప్లాప్ సినిమాల నుంచి క‌లెక్ష‌న్ల వ‌ర‌ద పారించిన హీరో చెర్రీ. అలాంటి చ‌ర‌ణ్‌కు ఇప్పుడు ఓ డైరెక్ట‌ర్‌నుంచి ఇబ్బందులు మొద‌ల‌య్యాయి.

ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న రామ్ చ‌ర‌ణ్‌.. దీని త‌ర్వాత ఎలాంటి సినిమాకు క‌మిట్ కాలేదు. ఇండియ‌న్‌-2 సినిమా నిర్మాత‌ల‌తో విభేదాలు రావ‌డంతో డైరెక్ట‌ర్ శంక‌ర్ రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా చేసేందుకు వ‌చ్చాడు.

చ‌ర‌ణ్ కూడా ఓకే చెప్ప‌డంతో ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. అయితే ఇండియ‌న్‌-2 నిర్మాత‌లు ఆ సినిమాను పూర్తి చేశాకే వేరే సినిమా చేయ‌లంటూ కోర్టుకెళ్లారు. అన్ని ఫిల్మ్ ఛాంబ‌ర్ల‌కు లేఖ‌లు రాశారు. దీంతో చ‌ర‌ణ్ సినిమా వాయిదా ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ సినిమాపై చ‌ర‌ణ్ అభిమానులు పెట్టుకున్న ఆశ‌లు ఆవిర‌య్యాయి. కాగా ఈ మూవీని ఎప్పుడు ప్రారంభిస్తారో అనే అనుమానాలు కూడా త‌లెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news